Ashwini Vaishnaw: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు .
2009-14 మధ్య యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంవత్సరానికి సగటున రూ.886 కోట్ల కేటాయింపు చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ మొత్తం 11 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల వేగవంతమైన అమలు
న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రైల్వే ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడటంతో ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు.
వివరాలు
రైల్వే ప్రాజెక్టుల పురోగతి
ప్రస్తుతం ఏపీలో రూ.80,097 కోట్ల నిధులతో 43 రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
మొత్తం 5,560 కి.మీ.మేర రైల్వే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు రూ.84,559 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అదనంగా,73 రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.2,051 కోట్లు వెచ్చించనున్నారు.
నూతన ట్రాక్‌లు & విద్యుదీకరణ
2014 నుంచి 1,949 కి.మీ. మేర రైల్వే లైన్లను విద్యుదీకరించి, 100% పూర్తిచేశారు.
గత పది సంవత్సరాల్లో 1,560 కి.మీ.మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించారు.ఇది శ్రీలంక మొత్తం రైల్వే నెట్‌వర్క్ కంటే ఎక్కువ. 2009-14 మధ్య సంవత్సరానికి 73 కి.మీ.
మేర కొత్త ట్రాక్ నిర్మించగా,2014-24 మధ్య 142 కి.మీ.కి పెరిగింది.అదేవిధంగా,విద్యుదీకరణ పనులు 37 కి.మీ. నుంచి 177 కి.మీ.కి పెరిగాయి.
వివరాలు
అదనపు మౌలిక సదుపాయాల విస్తరణ
2014 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 770 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. అదనంగా, 65 లిఫ్ట్‌లు, 34 ఎస్కలేటర్లు, 509 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం 15 జిల్లాల్లో 8 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మాల్దా-బెంగుళూరు మార్గంలో అమృత్ భారత్ ట్రైన్ ఏపీలోని 9 జిల్లాల గుండా ప్రయాణిస్తూ, 14 స్టేషన్లలో ఆగుతుంది.
వివరాలు
శాస్త్రీయ పరిశీలనతో కొత్త ప్రాజెక్టుల ఆమోదం
కొత్త ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను మరింత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నామని మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు.
గతంలో యూపీఏ హయాంలో కొన్ని ప్రాజెక్టులను బడ్జెట్‌లో చేర్చి, తగిన నిధులు కేటాయించకపోవడంతో అవి పురోగమించలేదని తెలిపారు.
ప్రస్తుతం, మొదట సర్వే నిర్వహించి, ఫీజిబిలిటీ ఉన్నట్లు తేలితే మాత్రమే డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) సిద్ధం చేస్తున్నారు.
ట్రాఫిక్ అవకాశాలు ఉండే ప్రాజెక్టులను ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్, వాణిజ్య శాఖ అనుమతులు పొందిన తర్వాత క్యాబినెట్‌కు తీసుకెళ్తున్నారు.
గత ఏడాది జులై నుండి రూ.40,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
ఇందులో అమరావతి రైల్వే లైన్ కూడా ఉంది. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ ప్రసంగంలో మాత్రమే కాకుండా,సంవత్సరమంతా సమీక్షిస్తూ ఆమోదిస్తున్నట్లు మంత్రి వివరించారు.
వివరాలు
పాత ట్రాక్ మార్పు & కొత్త రైల్వే లైన్‌ల అభివృద్ధి
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7,000కి.మీ.మేర పాత ట్రాక్‌ను మార్చి, కొత్త ట్రాక్ వేయనున్నారు.
మన రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా గంటకు 110కి.మీ.వేగంతో రైళ్లను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది.
ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి
విశాఖపట్టణం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.446కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు.అయితే, గుత్తేదారు పనులను సరిగ్గా చేయకపోవడంతో టెండర్ రద్దు చేయడం జరిగింది.
నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.103కోట్ల నిధులు కేటాయించి, పనులు పురోగతిలో ఉన్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.312 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.271.43 కోట్ల అంచనాతో టెండర్లు సిద్ధమవుతున్నాయి.
ఈ నాలుగు ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి మొత్తం రూ.1,132.43 కోట్లు వెచ్చించనున్నారు.