
AP Rains : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు చుట్టుముట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి నైరుతి దిశగా పయనించి, దక్షిణ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది.
వచ్చే 24 గంటల్లో ఇది ఉత్తర ఈశాన్య దిశగా మారి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Details
కోసాంధ్రకు ఎల్లో అలెర్ట్ జారీ
గురువారం నాటికి ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశంతో కోస్తాంధ్ర ప్రాంతానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బుధవారం నాటికి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏలూరు జిల్లాలో ఐదు మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, గుంటూరులో తొమ్మిది, పల్నాడులో రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదు కావచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.