Loading...
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!

Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆగస్టు 21 నుంచి 28వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వివరాలు 

ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మిగిలిన కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ADVERTISEMENT