
HYD Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. కొన్ని ప్రాంతాల్లో భారీగా గాలులు కూడా వీచాయి. యూసుఫ్‌గూడ, మధురానగర్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే, మలక్‌పేట, సైదాబాద్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్, బహదూర్‌పురా, కిషన్‌బాగ్, పురానాపూల్, జూపార్క్, గుర్రంగూడ, పక్కన ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా వాన కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షం వాహనదారులకు పెద్ద ఇబ్బందులను సృష్టించింది.
వివరాలు
వాయువ్య దిశలో ఉపరితల గాలులు
ఇక దక్షిణ హైదరాబాదులో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. షేక్‌పేట, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, మెహదీపట్నం, రాజేంద్రనగర్, చార్మినార్, సైదాబాద్, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని కేంద్రం తెలిపింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్టం 23 డిగ్రీలు ఉండే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అంచనా వేశారు. వాయువ్య దిశలో ఉపరితల గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు.