LOADING...
AP Rains: ఏపీలో నేడు, రేపు వర్షాల హెచ్చరిక.. పిడుగులపై అప్రమత్తంగా ఉండాలి
ఏపీలో నేడు, రేపు వర్షాల హెచ్చరిక.. పిడుగులపై అప్రమత్తంగా ఉండాలి

AP Rains: ఏపీలో నేడు, రేపు వర్షాల హెచ్చరిక.. పిడుగులపై అప్రమత్తంగా ఉండాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పిడుగులతో కలిసి కురిసే అవకాశముందని తెలిపారు.

వివరాలు

56 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం

అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఆదివారం ప్రకాశం జిల్లా కరేడు ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement