LOADING...
Weather Update: రానున్న మూడు రోజులు వర్షాలే.. పలు జిల్లాలకు హెచ్చరిక
రానున్న మూడు రోజులు వర్షాలే.. పలు జిల్లాలకు హెచ్చరిక

Weather Update: రానున్న మూడు రోజులు వర్షాలే.. పలు జిల్లాలకు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో వచ్చే శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి ఏర్పడింది.

వివరాలు

 జైనద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో యానాం తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నిడదమూరులో 40.1 డిగ్రీలు, మంగపేటలో 39.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement