
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటికే రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు తెలంగాణ మరో మూడు రోజలు పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వర్షాలు
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు
తెలంగాణ వ్యాప్తంగా సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి.
మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మామిడి, వరి, మొక్కజొన్న, తోటలు తదితర పంటలు దెబ్బతిన్నాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.