Page Loader
రానున్న 5 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్ జారీ
ఎల్లో అలెర్ట్ జారీ

రానున్న 5 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన... ఎల్లో అలెర్ట్ జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 29, 2023
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న 5 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరికలు జారీ చేస్తూ హై అలర్ట్ సూచించింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 3 వరకు భారీ వర్షాలున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, దీంతో వర్షాలు దంచికొట్టనున్నట్లు వివరించింది. ప్రజలంతా భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరంగల్,హన్మకొండ,కాజీపేటలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ వర్షం కురిసే అవకాశం