Loading...
Weather Report: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

Weather Report: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు జనగామ, హన్మకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్‌లోనూ వాతావరణం మారే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ADVERTISEMENT