
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ఈదురు గాలులతో వర్షాలు. 20 జిల్లాలకు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో శనివారం వాతావరణం కీలకంగా మారనుంది.
కొమరం భీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట,మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది.
దీనికి సంబంధించి ఈ జిల్లాలన్నింటికీ 'ఎల్లో అలెర్ట్' జారీ చేసింది. ఆదివారం కూడా వర్షాలు కొనసాగే సూచనలున్నాయి.
ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
Details
రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం అత్యధికంగా నిజామాబాద్‌లో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండగా, కనిష్టంగా హనుమకొండ, భద్రాచలం, హైదరాబాద్‌లలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
ఇక శుక్రవారం నాడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాల్లో నిజామాబాద్ 42.5, ఆదిలాబాద్ 41.8, మెదక్ 41.8, రామగుండం 40, నల్లగొండ 40, మహబూబ్ నగర్ 39.2, ఖమ్మం 39, భద్రాచలం 37.8, హైదరాబాద్ 37.8, హనుమకొండ 37.5 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదయ్యాయి.
ఇప్పట్లో గాలి, వర్షాలు, ఉష్ణోగ్రతల తేడాలతో సాధారణ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.