Page Loader
Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు
'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన తాజా వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఆఫ్‌ ద రికార్డులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఆయన ధృవీకరించారు. "భారీ ఆఫర్లు, పెద్ద ప్యాకేజీలు వస్తే,మా పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీలతో చేతులు కలుపుతారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు. ఇదంతా గతంలోనూ జరిగిందే. ఆ కారణంగానే అప్పట్లో పార్టీకి నష్టం జరిగింది," అని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇతర పార్టీలతో గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపారని రాజాసింగ్‌ ఆరోపించారు.

వివరాలు 

ఇతర పార్టీల నాయకులతో మా పార్టీలోని కొందరి స్నేహాలు, కలయికలు

"రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఎందుకు రాలేకపోయిందనే అంశంపై సీరియస్‌గా ఆలోచించాలి. వాస్తవానికి మేము ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ కొందరు నేతల స్వార్థపూరిత వ్యవహారాల వల్లే నష్టపోతున్నాం. ఇతర పార్టీల నాయకులతో మా పార్టీలోని కొందరి స్నేహాలు, కలయికలు అందరికీ తెలిసిన విషయమే," అని వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వాఖ్యలు