NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ 
    రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం

    Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 15, 2023
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమితులైన భజన్ లాల్ శర్మ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఇటీవల జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో శర్మతో పాటు, ఉపముఖ్యమంత్రులుగా ఎంపికైన దియా కుమారి,ప్రేమ్ చంద్ బైర్వా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురితో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు.

    ఐకానిక్ ఆల్బర్ట్ హాల్ ముందు జరిగిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

    Details 

    ప్రమాణస్వీకారం ముందు ఆలయంలో ప్రార్థనలు

    జైపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే,గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు.

    భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే కూడా హాజరయ్యారు.

    ప్రమాణస్వీకారం ముందు, శర్మ రాష్ట్ర రాజధానిలోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రార్థనలు చేశారు. టోంక్ రోడ్‌లోని పింజ్రాపోల్ గౌశాల వద్ద ఆవులకు ఆహారం ఇచ్చారు.

    ఆయనతో పాటు కుటుంబ సభ్యులు,మద్దతుదారులు కూడా ఉన్నారు. అనంతరం జవహర్ సర్కిల్ సమీపంలోని బాలాజీ టవర్‌లోని తన నివాసానికి వెళ్లిన బీజేపీ నేత, అక్కడ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం

    రాజస్థాన్

    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు  నరేంద్ర మోదీ
    Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్  తెలంగాణ
    BJP: రాజస్థాన్‌ బరిలో ఏడుగురు ఎంపీలు.. మాజీ సీఎంకి దక్కని చోటు  ఎన్నికలు
    CEC : కేంద్ర ఎన్నికల సంఘం కీలక సవరణ.. మారిన రాజస్థాన్‌ ఎన్నికల తేదీ ఎప్పుడో తెలుసా ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025