
Rajasthan: రాజస్థాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి, ఇద్దరు సిబ్బందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోగా,ఇద్దరు వైమానిక సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ఈ దుర్ఘటన బుధవారం భానుడా గ్రామ సమీపంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చురు జిల్లా రతన్‌గఢ్ ప్రాంతంలోని గ్రామం. జాగ్వార్ తరహా యుద్ధ విమానం కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం
🔴#BREAKING | IAF Jet Crashes In Rajasthan's Churu; More Details Awaited
— NDTV (@ndtv) July 9, 2025
వివరాలు
ప్రమాదం సమయంలో పెద్ద శబ్దం
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద వార్త అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటన జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన వెంటనే పొలాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు, దట్టమైన పొగ అలముకున్నట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు.