Page Loader
రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు
రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

రిటైర్మెంట్ వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్ధురాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 27, 2023
06:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

బామ్మగా మనవళ్లు, మనవరాళ్లను ఆడించే వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది. మాతృత్వం కోసం ఐవీఎఫ్ పద్దతి ద్వారా 75 ఏళ్ల వయస్సులోనూ కవల పిల్లలకు జన్మనిచ్చిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. ఇన్నాళ్లకు తల్లి ప్రేమను పంచే అదృష్టం దక్కిందంటూ ఆ పెద్దావిడకు బంధువులు, కుటుంబీకులు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. బికనీర్ లో 58 ఏళ్ల షేర్ బహదూర్ అనే వివాహితకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ పిల్లలు కలగలేదు. చివరికి ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డల్ని కనాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైద్య నిపుణులకు సంప్రదించింది. ఐవీఎఫ్ సహకారంతో అమ్మతనం కోసం రెండేళ్లు చికిత్సలు అందుకుంది.

DETAILS

ఆమె నిర్ణయం విని ఆశ్చర్యపోయాం : డాక్టర్ షెఫాలీ దధీచ్ షేరా

ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించడంతో గర్భం దాల్చింది. 9 నెలల కడుపును మోసి కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు బేబీ గర్ల్ కాగా, మరొకరు బేబీ బాయ్ పుట్టినట్లు వైద్యు వర్గాలు పేర్కొన్నాయి. పిల్లలు కావాలనే సంకల్పంతో వయసును లెక్కచేయకండా విశేష కృషి చేసిన బహదూర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వయస్సు దృష్ట్యా పిల్లలు కావాలన్న నిర్ణయం విని తొలుత తాము ఆశ్చర్యపోయామని డాక్టర్ షెఫాలీ దధీచ్ షేరా వెల్లడించారు. ఐవీఎఫ్ ప్రక్రియను డాక్టర్ షెఫాలీ ఆధ్వర్యంలోనే బికనీర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నిర్వహించారు.