Rajasthan: రాజస్థాన్‌లో ఓటర్ల లెక్కల్లో తేడా.. ఎస్ఐఆర్ కంటే ఎస్ఎస్ఆర్‌లో 11 లక్షలు అధికం!
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లో ఓటర్ల సంఖ్యపై గందరగోళం నెలకొంది. ఏడాది వ్యవధిలోనే రాష్ట్రంలో మూడు రకాల ఓటర్ల జాబితాలు రూపొందడం,వాటిలో ఓటర్ల సంఖ్య వేర్వేరుగా ఉండటంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా 2027 స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) కింద గురువారం కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 5.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో రాజస్థాన్‌లో 5.15 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు నమోదైంది. తాజాగా విడుదలైన ఎస్ఎస్ఆర్ జాబితాతో పోలిస్తే ఈ సంఖ్య 11 లక్షలు తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా,రాష్ట్రంలో మరో ఓటర్ల జాబితా కూడా అందుబాటులో ఉంది.
వివరాలు
మూడు జాబితాల్లోనూ ఓటర్ల సంఖ్య భిన్నం
రాజస్థాన్ ఎన్నికల సంఘం (SEC) అక్టోబర్‌లో ప్రచురించిన తుది ఎన్నికల జాబితాలో ఏకంగా 5.45కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం మూడు రకాల ఓటర్ల జాబితాలు ఉన్నట్లయింది.
మూడు జాబితాల్లోనూ ఓటర్ల సంఖ్య భిన్నంగా ఉండటమే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకారం 5.15కోట్లు,రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC)జాబితా ప్రకారం 5.45కోట్లు,స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ముసాయిదా జాబితా ప్రకారం 5.26కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
కేవలం ఏడాది వ్యవధిలోనే మూడు వేర్వేరు ఓటర్ల జాబితాలు వెలువడటం,వాటి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుండటంతో ఈ తేడాలకు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు ఏ జాబితాలోని ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపై అధికారుల్లో గందరగోళం నెలకొంది.