Page Loader
Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు 
ప్రియురాలి భర్తను దారణంగా హత్య చేసి, 6ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు

Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు 

వ్రాసిన వారు Stalin
Jul 19, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 33ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికేశాడు. ఆ శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. హత్య చేసిన వ్యక్తిని మదన్‌లాల్‌గా, మృతదేహాన్ని జోగేంద్రగా పోలీసులు గుర్తించారు. మదన్‌లాల్‌ హత్య చేసిన తీరును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. జోగేంద్ర మొండెంను సమీపంలోని అడవిలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అతని ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తల, చేతులు, కాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జోగేంద్ర శరీర భాగాలను పాతిపెట్టిన చేసిన స్థలంలో మామిడి మొక్కలను నిందితుడు నాటినట్లు పోలీసులు పేర్కొన్నారు.

రాజస్థాన్

జోగేంద్ర తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన హత్య

జోగేంద్ర జులై 11న ఇంటికి రాకపోవడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే జోగేంద్ర భార్య-మదన్‌లాల్ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలుసు. ఈ క్రమంలో జోగేంద్ర తండ్రి మదన్‌లాల్‌పై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు మదన్‌లాల్‌ను తమదైన శైలిలో విచరించగా అసలు విషయం బయటకు వచ్చింది. జులై 13న పోలీసులు మదన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జోగేంద్ర భార్యతో తనకు సంబంధం ఉందని, అతన్ని హత్య చేసినట్లు మదన్‌లాల్ అంగీకరించాడు. నేరం ఎలా చేశాడనే వివరాలను కూడా చెప్పాడు. తన కొడుకును చంపడంలో ఎక్కువ మంది ప్రమేయం ఉందని తాను నమ్ముతున్నట్లు జోగేంద్ర తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో పోలీసులు కోణంలో కూడా విచారిస్తున్నారు.