LOADING...
Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్.. దుస్సాహసానికి పాల్పడితే..!
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్.. దుస్సాహసానికి పాల్పడితే..!

Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్.. దుస్సాహసానికి పాల్పడితే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత్ పరోక్షంగా గట్టి సందేశం పంపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దుర్వినియోగం చేసుకుని పొరుగు దేశం ఏవైనా ప్రేరేపణ చర్యలకు దిగితే భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఉగ్రదాడులకు భారత్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుందో గుర్తు చేస్తూ, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా, గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తవుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

పొరుగు దేశం ఏవైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే..

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, "ప్రస్తుతం పరిస్థితులు సున్నితంగా ఉన్నాయి. ఈ సమయంలో మన పొరుగు దేశం ప్రేరేపించే చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందన అనూహ్యంగా, కఠినంగా ఉంటుంది" అని అన్నారు. ఇక గతంలో జరిగిన ఉగ్రదాడులకు భారత్ ఇచ్చిన బలమైన ప్రతిస్పందనలను కూడా ఆయన ప్రస్తావించారు. ఊరీ దాడి తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడి అనంతరం జరిగిన వైమానిక దాడులు, అలాగే పహల్గాం ఘటన తర్వాత నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో ఉగ్రవాదంపై భారత్ ఎప్పటికప్పుడు కఠిన వైఖరి ప్రదర్శించిందని పేర్కొన్నారు.

Advertisement