తదుపరి వార్తా కథనం

Election Commission: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. మే 9న పోలింగ్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 16, 2025
09:09 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఉప ఎన్నికకు నామినేషన్లను ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు.
అభ్యర్థులు మే 2వ తేదీ వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ మే 9న జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.