Page Loader
Rakesh Rathore Arrested: సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్.. 
సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్..

Rakesh Rathore Arrested: సీతాపూర్‌ ప్రెస్‌మీట్‌ మధ్యలో.. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ (Rakesh Rathore)ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపుర్‌ ఎంపీగా ఉన్న ఆయనపై అత్యాచార ఆరోపణలతో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు. సీతాపుర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. కఠినమైన పోలీసు భద్రత నడుమ ఆయనను కోర్టుకు తరలించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లుగా లైంగిక దాడికి గురిచేశారని ఒక మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఆరోపణలకు మద్దతుగా, రాథోడ్‌తో జరిగిన కాల్‌ రికార్డింగ్‌లను సైతం ఆమె పోలీసులకు సమర్పించింది. దీనితో, పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు 

భారీ బందోబస్తు మధ్య అదుపులోకి..

ఈ పరిణామాల నేపథ్యంలో, బుధవారం ఉదయం ఎంపీ రాథోడ్‌ అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌లో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అయితే, న్యాయస్థానం దీనిని తిరస్కరించింది. అలాగే, రెండు వారాల్లోగా సెషన్స్‌ కోర్టులో లొంగిపోవాలని సూచించినట్లు సమాచారం. ఇదివరకే ఇదే కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసినా, అది కూడా తిరస్కరించబడింది. ఈ పరిణామాల నేపథ్యంలో, గురువారం ఉదయం రాథోడ్‌ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.