Modi 3.0:మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలుగా రక్షా ఖడ్సే, అత్యంత వృద్ధుడిగా మాంఝీ
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, నరేంద్ర మోదీ(73) దేశ ప్రధానమంత్రిగా మూడవసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి గెలిచిన ప్రధానిగా ఆయన నిలిచారు. దేశం చూపు ఆయన పదవీకాలంపైనే ఉంది. గత ప్రభుత్వం కంటే మోడీ ప్రభుత్వం 3.0 ఎంత భిన్నంగా ఉంటుందనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కొత్త మంత్రివర్గం సగటు వయస్సు 58 సంవత్సరాలు. 37 ఏళ్ల రక్షా నిఖిల్ ఖడ్సే పిన్నవయస్కురాలు, కాగా 79 ఏళ్ల జితన్‌రామ్ మాంఝీ అత్యంత వృద్ధుడు.
మాంఝీ బీహార్‌కి 23వ ముఖ్యమంత్రి
మహారాష్ట్రకు చెందిన ఎంపీ ఖడ్సే, ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మంత్రి మండలిలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలోని రావర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. మంఝీ (79) మోదీ ప్రభుత్వం మూడో దఫాలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాంఝీ బీహార్‌కి 23వ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు. అంతకుముందు నితీష్ కుమార్ కేబినెట్‌లో షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గయా స్థానం నుంచి గెలుపొందారు. ఇతర యువ మంత్రులలో చిరాగ్ పాశ్వాన్,జయంత్ చౌదరి ఉన్నారు.