Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?
అయోధ్యలో రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత, అయోధ్యలో రామ్‌లాలాను చూసేందుకు వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే, శ్రీరామనవమి పండుగ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రామమందిరంలోని ప్రసాదం, సరయూ నీరు వంటి ప్రత్యేక వస్తువులకు చాలా డిమాండ్ ఉంది. అయోధ్యకు వెళ్లి రాంలాలా దర్శనం చేసుకోలేని వారు ఆన్‌లైన్‌లో ప్రసాదం ఆర్డర్ చేస్తున్నారు. ఇదిలావుండగా, ప్రభుత్వం 50 గ్రాముల రామాలయ వెండి నాణేల లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రజల విక్రయానికి విడుదల చేసింది. పబ్లిక్ అమ్మకానికి విడుదల చేసిన ఈ నాణెం ధర రూ. 5860/-. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడింది. దీన్ని SPMCILI వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఈ నాణెం ఎవరికైనా గిప్ట్ గా ఇవ్వొచ్చు
ఈ నాణెం రాంలాలా,రామ మందిరం థీమ్ ఆధారంగా రూపొందించబడింది.ఈ నాణెంలో,ఒక వైపు రామ్ లల్లా విగ్రహం (గర్భగుడిలో కూర్చున్న రామ్ లల్లా విగ్రహం)మరొక వైపు రామాలయం ఉంది. ఈ విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు.ఈ నాణెం కొనుగోలు చేసి మీ ఇంటిలోని పూజా స్థలంలో ఉంచవచ్చు. ఇది కాకుండా,ఈ నాణెం మీ సన్నిహితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చని రామ మందిర ట్రస్ట్ చెప్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్య ఆలయంలో కొత్త రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భాన్ని కొత్త శకానికి చిహ్నంగా అభివర్ణించారు.ఆలయ నిర్మాణానికి అతీతంగా ముందుకు సాగాలని,రాబోయే 1,000సంవత్సరాల పాటు బలమైన,గొప్ప దైవిక భారతదేశానికి పునాది వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.