NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
    తదుపరి వార్తా కథనం
    Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
    అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

    Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

    ఈ ఘటన స్థానికుల దృష్టికి వచ్చిన వెంటనే మంటలను ఆర్పారు.అయితే ఆ సమయంలో రథం సగానికి పైగా కాలిపోయింది.

    స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణ్ దుర్గం డివిజన్ డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    కాలిపోయిన తెరును డీఎస్పీ రవిబాబు పరిశీలించారు.ఈకేసు క్రింద నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

    తేరు కాలిన ప్రదేశంలో నిందితులకు సంబంధించిన విలువైన సంచారాలను సేకరించినట్లు సమాచారం అందుతోంది.

    సంఘటనా స్థలంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

    వివరాలు 

    నిందితులని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి: చంద్రబాబు  

    ఇదే సమయంలో,అనంతపురం జిల్లాలో రథం దగ్ధంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు.

    అర్ధరాత్రి ఆలయ రథం దగ్ధం అయిన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం,అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

    సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.

    దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కూడా కోరారు.అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు,జిల్లా కలెక్టర్,ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

    అలాగే,ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.అలాగే నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి  ప్రకాశం జిల్లా
    Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్ విజయవాడ వెస్ట్
    Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు   విజయవాడ వెస్ట్
    Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల ప్రకాశం జిల్లా

    చంద్రబాబు నాయుడు

    Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం  భారతదేశం
    Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష భారతదేశం
    Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు అనకాపల్లి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025