NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..? 
    తదుపరి వార్తా కథనం
    Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..? 
    ద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు

    Ram Mandir: అద్వానీ, మురళీ మనోహర్ జోషి రామ మందిర శంకుస్థాపనకు గైర్హాజరు.. అతిథులు ఎవరంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 19, 2023
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలో రామమందిరం ఉద్యమానికి పెద్దపీట వేసిన భాజపా కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా వచ్చేనెల జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ సోమవారం ఇక్కడ తెలిపింది.

    వారిద్దరి వయస్సును పరిగణనలోకి తీసుకుని,వారిని రావద్దని అభ్యర్థించగా, దానికి ఇద్దరూ అంగీకరించారని రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులతో తెలిపారు.

    జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే శంకుస్థాపన మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని రాయ్ తెలిపారు.

    జనవరి 15 నాటికి సన్నాహాలు పూర్తవుతాయని,జనవరి 16 నుంచి 'ప్రాణ ప్రతిష్ఠ' పూజలు ప్రారంభమై జనవరి 22 వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

    Details 

    వేడుకకు 4,000 మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులు 

    మాజీ ప్రధాని దేవెగౌడను వేడుకలకు ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాయ్ తెలిపారు.

    ఆరు దర్శన సంప్రదాయాలకు చెందిన శంకరాచార్యులతోపాటు,దాదాపు 150 మంది సాధువులు, ఋషులు ఈ వేడుకలో పాల్గొంటారని రాయ్ చెప్పారు.

    ఈ వేడుకకు దాదాపు 4,000 మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

    కాశీ విశ్వనాథ్, వైష్ణో దేవి వంటి ప్రధాన ఆలయాల అధిపతులు, మతపరమైన,రాజ్యాంగ సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

    Details 

    దీక్షా కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు  

    ఆధ్యాత్మిక గురువు దలైలామా,కేరళకు చెందిన మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రామ్‌దేవ్,సినీ తారలు రజనీకాంత్,అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్,అరుణ్ గోవిల్,సినీ దర్శకుడు మధుర్ భండార్కర్,ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ,అనిల్ అంబానీ,ప్రముఖ చిత్రకారుడు వాసుదేవ్ కామత్,ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్‌తో పాటు పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు రాయ్ తెలిపారు.

    శంకుస్థాపన అనంతరం జనవరి 24 నుంచి 48 రోజుల పాటు ఆచార సంప్రదాయాల ప్రకారం 'మండల పూజ' నిర్వహించనున్నారు.

    జనవరి 23న భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తామని తెలిపారు. అయోధ్యలో మూడు కంటే ఎక్కువ ప్రదేశాలలో అతిథులు బస చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని రాయ్ తెలిపారు.

    Details 

    శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించిన మునిసిపల్ కార్పొరేషన్

    ఇది కాకుండా, వివిధ మఠాలు, దేవాలయాలు, ఇళ్లు 600 గదులు అందుబాటులో ఉంచామని తెలిపారు.

    ఈ క్రమంలో, అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు.

    మునిసిపల్ కమీషనర్ విశాల్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ, భక్తుల కోసం ఫైబర్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని, నిర్దేశించిన ప్రదేశాలలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

    రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో 'రామ్ కథా కుంజ్' కారిడార్ నిర్మిస్తామని , ఇది రాముడి జీవితంలోని 108 థీమ్‌ల ద్వారా అలంకరించబడుతుంది ఆయన చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025