Page Loader
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఇతర సీనియర్‌ బీజేపీ నేతలు హాజరయ్యారు. తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన రామచందర్‌రావు, ముందుగా ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో, అనంతరం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. రామచందర్‌రావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం కానుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.