LOADING...
Sridharbabu: రామంతాపూర్ విషాదం.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
రామంతాపూర్ విషాదం.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

Sridharbabu: రామంతాపూర్ విషాదం.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ఘోర విషాదం అందరిని కలిచివేసింది. ఊరేగింపు కోసం ఉపయోగించిన రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సోమవారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించారు.

Details

విద్యుత్ తీగలు తగడంతో మృతి

రథాన్ని లాగుతున్న వాహనం మధ్యలో సమస్య రావడంతో దాన్ని పక్కన నిలిపివేశారు. దీంతో స్థానిక యువకులు స్వయంగా రథాన్ని చేతులతో లాగడం ప్రారంభించారు. ఈ క్రమంలో రథం విద్యుత్ తీగలకు తగిలింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో రథం లాగుతున్న తొమ్మిది మంది గాల్లో ఎగిరిపడి కుప్పకూలారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటనతో గోఖలేనగర్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది