
Rangam Bhavishyavani 2025: వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి..అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టమైన 'రంగం' కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి తెలియజేశారు. రాష్ట్రాన్ని,దేశాన్ని రక్షించే బాధ్యత తనపై ఉందని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో మహమ్మారి విస్తరించే ప్రమాదం ఉందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు బాగా పండే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
ఆ విషయంలో నేను అడ్డురాను
''మీరు మీ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.. కానీ నేను వారికి మాతృస్వభావంతో రక్షణగా ఉంటాను. ఈసారి మీరు ఎంతో ఆనందంగా పూజలు నిర్వహించారు. మీ అందరినీ సమానంగా చూసి, మీకు శ్రేయస్సు కలగాలని ఆశిస్తున్నాను. మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలముల్లును నాలుకతో తీస్తాను.. కాలం వచ్చినప్పుడు ఎవరు ఏ కర్మ అనుభవించాలో అది తప్పకుండా అనుభవిస్తారు. ఆ విషయంలో నేను అడ్డురాను'' అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.