తదుపరి వార్తా కథనం
Ranya Rao: యూట్యూబ్ నుండి బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నా.. రన్యా రావు సంచలన విషయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 13, 2025
09:18 am
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) వ్యవహారం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
దర్యాప్తు సమయంలో ఆమె కీలకమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని రన్యా రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
ఆ విషయం యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నా
''దుబాయ్ నుంచి ఇంతకు ముందు ఏ తరహాలోనూ బంగారాన్ని అక్రమంగా తరలించలేదు. స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి. ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని దాచడం ఎలా అనే విషయం యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నా'' అని రన్యా రావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.