Ranya Rao: 17 బంగారు కడ్డీలు తెచ్చిన నటి రన్యారావు.. అమెరికా, యూరప్, దుబాయ్‌లకు ట్రిప్ లు..
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె యూఏఈ (UAE) నుంచి 17 బంగారు బిస్కెట్లను తీసుకువచ్చారు.
అంతేకాకుండా, రన్యా రావు దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు కూడా ప్రయాణించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు వెల్లడించారు.
అయితే, తాను చెప్పిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
వివరాలు
ట్రిప్‌కు ఆమె రూ. 12-13 లక్షలు
విచారణ సందర్భంగా తాను అలసిపోయానని, కొంత విశ్రాంతి కావాలని రన్యా రావు అభ్యర్థించారని సమాచారం.
ఈ కేసులో తాను పూర్తిగా సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని కూడా ఆమె స్పష్టం చేశారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం, రన్యా రావు గత ఏడాది 30 సార్లు దుబాయ్ వెళ్లారు.
కేవలం 15 రోజుల్లోనే 4 సార్లు ప్రయాణించారని, ప్రతి ప్రయాణంలో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.
ప్రతి ట్రిప్‌కు ఆమె రూ. 12-13 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
వివరాలు
కేసు వెనుకప్రముఖ రాజకీయ నేత హస్తం
ఇటీవల, 14.2 కిలోల బంగారంతో దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో ఆమెను అధికారులు విమానాశ్రయంలో చివరి నిమిషంలో అదుపులోకి తీసుకున్నారు.
తరచుగా దుబాయ్‌కి ప్రయాణించడం, ప్రతి సారి ఒకే రకమైన దుస్తులు ధరించడం వంటి విషయాల కారణంగా ఆమెపై అనుమానం వచ్చి నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.
ఈ కేసు వెనుక ఓ ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
అంతేగాక, రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి కూడా ఆమెతో కలిసి పలు మార్లు దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు. దాంతో, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.