LOADING...
Gurmeet Ram Rahim: గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..
గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..

Gurmeet Ram Rahim: గుర్మీత్ రామ్ రహీమ్‌కు 40 రోజుల పెరోల్..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాచారం,హత్య కేసుల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 40 రోజుల పెరోల్ పొందిన ఆయన,ఈ రోజు హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సునారియా జైలులోనుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం,ఆయన ఊరేగింపు తరహాలో సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం వైపు ప్రయాణం ప్రారంభించారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ 2020 తర్వాత తాత్కాలికంగా జైలు నుంచి బయటకు రావడం ఇది 14వ సారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆయన 21రోజుల సెలవుపై విడుదలయ్యారు. ఇప్పటి వరకు,ఇలా ఆయన మొత్తం 326 రోజులు జైలు వెలుపలే గడిపినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వివరాలు 

రంజిత్ సింగ్ హత్యకు కుట్ర కేసులో దోషిగా..

గుర్మీత్ రామ్ రహీమ్‌పై 2017లో తన ఆశ్రమానికి చెందిన ఇద్దరు మహిళ శిష్యులపై అత్యాచారానికి పాల్పడ్డారన్నఆరోపణలపై న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు,2019లో జరిగిన పత్రికా విలేఖరి హత్య కేసులో కూడా ఆయనను దోషిగా తీర్పు చెప్పింది. అనంతరం2021లో డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకు కుట్ర కేసులో ఆయన దోషిగా తేలారు. ఇలాంటి తీవ్రమైన నేరాల శిక్ష అనుభవిస్తున్నప్పటికీ,గుర్మీత్ రామ్ రహీమ్‌కు మళ్లీమళ్లీ పెరోల్ లేదా ఫర్లో మంజూరవుతుండడం విపక్షాలు సహా పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతఏడాది అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకి ముందు 20రోజుల పెరోల్ మంజూరు కాగా,ఈఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎనిమిది రోజుల ముందు 30 రోజుల పెరోల్ ఇచ్చారు.

వివరాలు 

రాజకీయ ప్రయోజనాల కోణంలో పెరోల్‌

ఈ పరిణామాల నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోణంలో పెరోల్‌లను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రతి పెరోల్ సమయంలోను గుర్మీత్ రామ్ రహీమ్, సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ, భక్తులతో సమావేశాలు, ప్రసంగాలు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు.