Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ నుంచి అమరావతికి రెండు గంటల్లో చేరుకునేలా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో ఢిల్లీ-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయని, అలాంటి సేవలు ఆంధ్రప్రదేశ్‌కు అందించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన భూమిని ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కావాల్సిన ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్లు, రైల్వేలు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ
అనకాపల్లి జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు. దీపం పథకంపై గతంలో విమర్శలొచ్చాయని, ఇప్పుడు ఏడాదికి 3 సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలకు డ్రోన్స్ అందించడం, పంటలకు మందులు చల్లడానికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరం నీళ్లు విశాఖకు తీసుకువచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఆయన గుర్తుచేశారు. ఇక అన్నా కాంటీన్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.