Kurnool: కోడుమూరు పొలాల్లో అరుదైన 'రామదాసు' పక్షి దర్శనం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 16, 2026
08:35 am
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి సమీపంలోని పంట పొలాల్లో అరుదైన పక్షి దర్శనమిచ్చింది. నల్లటి రెక్కలతో కనిపించే ఈ తెల్ల డేగను రైతులు తమకు మిత్రుడిలా భావిస్తున్నారు. పంటలకు నష్టం కలిగించే ఎలుకలు,మిడతలు సహా ఇతర హానికర పురుగులను ఇది ఆహారంగా తీసుకోవడంతో సాగుదారులకు మేలు చేస్తోంది. ఈ పక్షిని'బ్లాక్ షోల్డర్డ్ కైట్'గా పిలుస్తారని, తెలుగులో దీనికి 'రామదాసు' పక్షి అనే పేరు ఉందని కర్నూలులోని కేవీఆర్ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకురాలు హేమలత తెలిపారు. సాధారణంగా ఆఫ్రికా ప్రాంతాల్లో విస్తృతంగా కనిపించే ఈ విహంగం, మన దేశంలో సిక్కిం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తుందని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వీటి ఉనికి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తోందని ఆమె వివరించారు.