LOADING...
Kadapa: సోమశిల అటవీ ప్రాంతంలో అరుదైన తోక పిగిలి పిట్ట దర్శనం
సోమశిల అటవీ ప్రాంతంలో అరుదైన తోక పిగిలి పిట్ట దర్శనం

Kadapa: సోమశిల అటవీ ప్రాంతంలో అరుదైన తోక పిగిలి పిట్ట దర్శనం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 06, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పిడికెడు పరిమాణంలో ఉన్న దేహం,బారెడు పొడవైన తోకతో పచ్చని చెట్ల మధ్య మెరిసిపోతూ కనిపించిన అరుదైన పక్షి 'తోక పిగిలి పిట్ట'గా గుర్తించారు. ఈ పక్షి సోమశిల వెనుక జలాల పరిసర ప్రాంతంలో దర్శనమిచ్చింది. తెల్లటి పొడవైన తోక, నల్లటి తల, తలపై ఉన్నట్టే కనిపించే చిన్న కొప్పుతో ఈ పిట్ట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ పక్షులు మన రాష్ట్రంలో చాలా అరుదుగా మాత్రమే దర్శనమిస్తాయని అటవీశాఖ విశ్రాంత క్షేత్రాధికారి మహమ్మద్ హయత్ తెలిపారు.

వివరాలు 

సీతాకోక చిలుకలు, చిన్న కీటకాలు,పురుగులే ఆహారం

ఈ పక్షుల ఆహారం ప్రధానంగా సీతాకోక చిలుకలు, చిన్న కీటకాలు, పురుగులేనని ఆయన వివరించారు. ఇవి సాధారణంగా దట్టమైన అడవుల్లో, ఎత్తైన ప్రాంతాల్లో విహరిస్తూ, నీటి వనరుల సమీపంలో గూళ్లు కట్టుకుంటాయని చెప్పారు. అరుదైన పక్షులకు నిలయంగా పేరుగాంచిన వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని పెనుశిల నరసింహ అభయారణ్యం, అలాగే లంకమల అరణ్య ప్రాంతాల్లో కూడా ఈ పక్షులు ఆకట్టుకుంటున్నాయని వెల్లడించారు.

Advertisement