Page Loader
High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం
రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం

High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. కోర్టు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులకు కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పి తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మంగళవారం బందరు తాలుకా పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఆరో నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అతడిని ఏ క్షణంమైనా అరెస్టు చేసే అవకాశముందని పుకార్లు వ్యాప్తి చెందడంతో, ఆయన హైకోర్టులో లంచ్‌ మోషన్‌ ద్వారా ముందస్తు పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం, పేర్ని నానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది.

Details

ఏ2 నిందితురాలిగా జయసుధ 

ఇప్పటికే ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధను ఏ1 నిందితురాలిగా పేర్కొని కేసు నమోదు చేయగా, ఆమె కోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్‌ మంజూరైంది. రేషన్‌ బియ్యం మాయం కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని మచిలీపట్నం స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించింది. నిందితులుగా ఉన్న వారిలో రైస్‌ గోదాం మేనేజర్‌ మానస తేజ్, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, రైస్‌ మిల్లర్‌ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావు ఉన్నారు. వారందరికీ నిన్న రాత్రి రిమాండ్‌ విధించింది.