Page Loader
Perni Nani: రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

Perni Nani: రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రేషన్‌ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదైంది. మచిలీపట్నం తాలూకా పీఎస్‌లో ఆయన్ను ఏ6గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారికి మచిలీపట్నం స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించారు. అరెస్టయిన నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టయిన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్‌ మానస్‌ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగరాజు ఉన్నారు.

Details

బియ్యం నిల్వల్లో వ్యత్సాసం

వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించి, ఆ గిడ్డంగిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. తాజాగా ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేసినప్పుడు, బియ్యం నిల్వల్లో వ్యత్యాసం కనిపించింది. పెద్ద ఎత్తున పీడీఎస్‌ బియ్యం మాయమైనట్లు తేల్చారు. గోదాము మేనేజర్‌ మానస్‌ తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి మరియు మిగిలిన ఇద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీలలో సుమారు రూ.25 లక్షల నుండి రూ.30 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా, పేర్ని నాని కుటుంబ సభ్యుల ఖాతాల్లో కూడా మానస్‌ తేజ ఖాతా నుండి డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.