NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం
    తదుపరి వార్తా కథనం
    భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం
    'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం

    భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 19, 2023
    06:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత గూఢచారి విభాగం 'రా' (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) కొత్త చీఫ్ గా రవి సిన్హా నియమితులయ్యారు.

    1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రవి సిన్హా, చత్తీస్ గఢ్ క్యాడర్ కు చెందినవారు. గడిచిన 7 సంవత్సరాలుగా 'రా' ఆపరేషనల్ వింగ్ అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

    విదేశాల్లో భారత్ తరఫున గూఢచర్యం, నిఘా వ్యవహారాల్లో రవి సిన్హా పెట్టింది పేరు. ఈ మేరకు ఇండియన్ గూఢాచారి సంస్థకు కొత్త సారథిగా రవి సిన్హా నియామకంపై కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదించింది.

    సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటేరియట్ లో స్పెషల్ సెక్రటరీగా విధులు కొనసాగిస్తున్నారు.

    DETAILS

    సిన్హాకు సంబంధించిన వివరాలన్నీ గోప్యమే

    ఇప్పటివరకు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ బాస్ గా వ్యవహరించిన సమంత్ కుమార్ గోయల్ త్వరలోనే రిటైర్ కాబోతున్నారు.

    ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. భారత గూఢచర్యం విభాగంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా కొత్త అధిపతి రవి సిన్హా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

    దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు. ఈ విషయం తప్ప, రవి సిన్హాకు సంబంధించిన మరే వ్యక్తిగత విషయాలు చాలా వరకు గోప్యంగా ఉండటం గమనార్హం.

    అయితే ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సదరు ఏజెన్సీ అత్యంత గోప్యంగా ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    భారతదేశం

    ఏపీకి భాజపా అగ్రనేతల క్యూ.. ఆంధ్రలో పొలిటికల్ హీట్ షురూ అమిత్ షా
    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్రమంత్రి
    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు కేంద్రమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025