తదుపరి వార్తా కథనం

Gautam Singhania : 'రేమండ్స్ ఛైర్మన్ దంపతులకు విడాకులు.. అయినా పిల్లల కోసం పనిచేస్తాం'
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 13, 2023
05:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ రేమండ్స్ ఛైర్మన్ గౌతం సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ మేరకు గౌతం సింఘానియా సోమవారం ప్రకటించారు.
ఎవరి మార్గాల్లో వారు ప్రయాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 1999లో సొలిసిటర్ గా పనిచేసిన నాడార్ మోదీ కూతురు నవాజ్ మోదీని గౌతం సింఘానియా వివాహం చేసుకున్నారు.
గతంతో పోలిస్తే ఈ దీపావళి సంతోషంగా గడవలేదని గౌతం సింఘానియా భావోద్వేగంగా అన్నారు.
టెక్స్ టైల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్న రేమండ్స్ సంస్థకు గౌతం సింఘానియా సీఎండీగా వ్యవహరిస్తున్నారు.
32ఏళ్ల వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం, నిబద్ధతతో కలిసి జీవించామన్నారు. భార్య నవాజ్‌తో విడిపోయినా ఇద్దరు కూతుళ్ల ఫ్యూచర్ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భార్య మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించిన గౌతమ్ సింఘానియా
— Gautam Singhania (@SinghaniaGautam) November 13, 2023