Page Loader
రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన

రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన

వ్రాసిన వారు Stalin
May 19, 2023
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) నిర్ణయించింది. ఈ నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని ఆర్‌బీఐ శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది. రూ.2000 నోట్ల జారీని తక్షణం నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. సెప్టెంబర్ 30, 2023లోపు అన్ని రూ.2,000 కరెన్సీ నోట్లను తప్పనిసరిగా మార్చుకోవాలని ఆర్‌బీఐ శుక్రవారం సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్‌ల‌ల్లో డిపాజిట్ చేయడానికి తగిన సమయాన్ని, సహకారాన్ని అందిచాలని ఆర్‌బీఐ చెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.2వేల నోటును ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన