NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..
    సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..

    Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే.

    ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు.

    మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే బంగ్లాదేశీ వ్యక్తి నిందితుడు.

    గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం చేయడానికి చొరబడిన నిందితుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.

    ఈ దాడి వల్ల సైఫ్ ఆరు చోట్ల గాయపడగా, వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.

    సైఫ్ వెన్నుపూసలో కత్తి భాగం ఉండడంతో, వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారు.

    వివరాలు 

     డిశ్చార్జ్ అయిన తీరుపై అనుమానాలు 

    అయితే, ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ అయిన తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    తీవ్ర గాయాలు అయ్యిన వ్యక్తి ఎలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు.

    మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, ''ఈ ఘటన నిజమా లేదా, లేక సైఫ్ నటిస్తున్నారా?'' అని సందేహం వ్యక్తం చేశారు.

    సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చూడగా, ఆయనపై నిజంగా దాడి జరిగిందా? అనే అనుమానం కలిగిందని అన్నారు.

    వివరాలు 

    అప్పుడు  మాత్రమే ప్రతిపక్ష నాయకులు స్పందిస్తారా

    ఇక మరికొందరు ఈ విషయంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.

    ఒక ''ఖాన్'' ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నాయకులు స్పందిస్తారా? అని ప్రశ్నించారు.

    దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఎన్సీపీ నేత జితేంద్ర అవాద్, ఎంపీ సుప్రియా సూలేలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

    షారూఖ్ ఖాన్ కుమారుడి విషయంలో నవాబ్ మాలిక్ స్పందించినప్పుడు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గురించి సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, హిందూ నటుల గురించి ఎప్పుడైనా ఇలానే ఆందోళన చూపారా? అని విమర్శలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ జార్ఖండ్
    Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ! ఇండియా
    Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి! ఇండియా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025