LOADING...
Yogi Adityanath: విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి: యోగి ఆదిత్యనాథ్
విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి: యోగి ఆదిత్యనాథ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇకపై వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన 'ఏక్తా యాత్ర' కార్యక్రమంలో భాగంగా జరిగిన సమూహ వందేమాతరం గేయాలాపన సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. విద్యాసంస్థల్లో చిన్న వయసులోనే జాతీయ గీతాన్ని పాడించడం వల్ల విద్యార్థుల్లో దేశాభిమానం, గౌరవభావం సహజంగానే పెరుగుతాయి అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

వివరాలు 

'ఆనంద మఠ్' నవలలో ఈ గేయం మొదటిసారి వెలువడింది

భారత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో లక్షలాది భారతీయులకు ప్రేరణగా నిలిచిన 'వందేమాతరం' గీతానికి ఈ నవంబర్ 7తో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1875 నవంబర్ 7న బంకిమ్ చంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించారు. ఆయన రాసిన 'ఆనంద మఠ్' నవలలో ఈ గేయం మొదటిసారి వెలువడింది. దిల్లీలో శుక్రవారం నిర్వహించిన వందేమాతరం 150వ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వందేమాతరం కేవలం గేయం మాత్రమే కాకుండా ఒక దృక్పథం,ఒక సంకల్పం, ఒక శక్తి మంత్రము అని పేర్కొన్నారు. ఈ పదాలు ప్రజల్లో ఆత్మవిశ్వాసం,ధైర్యం, భవిష్యత్తుపై నమ్మకం నింపగల శక్తి కలిగి ఉన్నాయని అన్నారు.