తదుపరి వార్తా కథనం
Paderu: పాడేరులో రికార్డుస్థాయిలో చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 09, 2026
11:48 am
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరులో గురువారం ఉదయం 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై స్థానికులను ఆహ్లాదపరిచింది. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి: పెదబయలు: 4.8°C చింతపల్లి: 5°C హుకుంపేట: 6.2°C కొయ్యూరు: 9.7°C చలి తీవ్రత స్థానిక రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని సృష్టిస్తోంది. ఈ సమయంలో సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.