LOADING...
Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 
తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2024
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డ్ స్థాయిని చేరుకుంది. ట్రాన్స్‌‌కో సీఎండీ ప్రకారం, గురువారం ఉదయం 7:30 గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరింది. ఈ సీజన్‌లో విద్యుత్ వినియోగం 15,573 మెగావాట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 14,816 మెగావాట్లతో పోలిస్తే 5.11 శాతం అధికమని తెలిపారు. మార్చి 14న అత్యధికంగా 308.54 మిలియన్ యూనిట్లు వినియోగించబడినట్లు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 266.14 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా,గత ఏడాది ఇదే కాలంలో 250.25 మిలియన్ యూనిట్లు సరఫరా అయ్యాయని చెప్పారు. ఇది 6.35 శాతం అధికమని వెల్లడించారు.

వివరాలు 

 విద్యుత్‌శాఖ అధికారులను అభినందించిన డిప్యూటీ సీఎం

అలాగే, సెప్టెంబర్, అక్టోబర్‌ పీక్ ఖరీఫ్ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. వ్యవసాయ రంగం తోపాటు ఇతర వినియోగదారులకు కూడా అవసరమైన విద్యుత్‌ను నిరంతరం అందించేందుకు డిస్కమ్‌లు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించినట్లు వివరించారు.