LOADING...
Telangana: వరంగల్‌ మిర్చి మార్కెట్‌లో దేశీ మిర్చికి రికార్డు ధర.. గత మూడేళ్లలో ఇదే అధిక ధర
గత మూడేళ్లలో ఇదే అధిక ధర

Telangana: వరంగల్‌ మిర్చి మార్కెట్‌లో దేశీ మిర్చికి రికార్డు ధర.. గత మూడేళ్లలో ఇదే అధిక ధర

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం దేశీ మిర్చి క్వింటా రూ.41,200కోసం విక్రయమైంది. త మూడేళ్లలో దేశీమిర్చికి ఇదే రికార్డు ధరని మార్కెట్‌ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, కైర్వాడి గ్రామానికి చెందిన దస్తగిరి అనే రైతు తీసుకువచ్చిన సుమారు 6 క్వింటాల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. ఈ మార్కెట్‌లో, 2022 అక్టోబర్‌లో ఇదే రకం మిర్చి క్వింటాకు రూ.90,000 ధర పలికింది. అంతర్జాతీయంగా దేశీ మిర్చి డిమాండ్‌ తగ్గడంతో ఆ తర్వాత ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే, రెండు సంవత్సరాల క్రితం ఈ దేశీ మిర్చికి జీఐ (GI) గుర్తింపు లభించింది.

Advertisement