LOADING...
IMD: రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ
రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ

IMD: రానున్న మూడు రోజులు తీవ్ర వేడి గాలులు.. దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వచ్చే కొన్ని రోజుల పాటు తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రాజధానిలో రాబోయే మూడు రోజులు తీవ్రమైన ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా గురువారం వరకు వేడిగాలులు అధికంగా ఉంటాయని చెప్పారు. ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముందని పేర్కొంటూ రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అయితే సాయంత్రం సమయంలో వాతావరణం కొంతవరకూ చల్లబడవచ్చని ఐఎండీ తెలిపింది. ఇక వారం చివర్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విభాగం అంచనా వేసింది.

వివరాలు 

 నిన్న వాతావరణ శాఖ ఢిల్లీలో ఆరెంజ్‌ అలర్ట్‌

ఇక గత సోమవారం నాడు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 43.4 డిగ్రీల సెల్సియస్, పాలెం లో 44.3 డిగ్రీలు, లోధి రోడ్డులో 43.3 డిగ్రీలు, రిడ్జ్ ప్రాంతంలో 44.9 డిగ్రీలు, అయా నగర్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో నిన్న వాతావరణ శాఖ ఢిల్లీలో ఆరెంజ్‌ అలర్ట్‌ను కూడా ప్రకటించింది.