Page Loader
weather alerts: వాతావరణ శాఖ జారీ చేసే రెడ్,ఆరెంజ్,ఎల్లో అలర్ట్స్ హెచ్చరికల అర్థం ఏమిటి.. అవి ఎప్పుడు జారీ చేస్తారు? 
వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల అర్థం ఏమిటి.. అవి ఎప్పుడు జారీ చేస్తారు?

weather alerts: వాతావరణ శాఖ జారీ చేసే రెడ్,ఆరెంజ్,ఎల్లో అలర్ట్స్ హెచ్చరికల అర్థం ఏమిటి.. అవి ఎప్పుడు జారీ చేస్తారు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 26, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనం తరచుగా వాతావరణానికి సంబంధించిన ఏదైనా వార్తలను చూసినప్పుడు, చదివినప్పుడు లేదా విన్నప్పుడు, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల గురించి మనం వింటూ ఉంటాము. అయితే ఈ అలర్ట్ అంటే ఏంటో తెలుసా లేదా అందులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? వాతావరణ శాఖ ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేస్తుందో , వాటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో పసుపు, నారింజ, ఎరుపు హెచ్చరికలు ఉన్నాయి. ఈ మూడు వేర్వేరు పరిస్థితులలో జారీ అవుతాయి.ఈ మూడింటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి.

వివరాలు 

ఎల్లో అలెర్ట్ 

వాతావరణ శాఖ హెచ్చరికగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ అలర్ట్ ప్రధాన ఉద్దేశం. అందువల్ల వాతావరణం మరింత దిగజారితే ప్రజలు సిద్ధంగా ఉండాలి. దీనితో పాటు, వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి. 7.5 మి.మీ నుంచి 15 మి.మీ మధ్య వర్షపాతం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు

వివరాలు 

ఆరెంజ్ అలర్ట్

ఎల్లో అలర్ట్ తరువాత ఆరెంజ్ అలర్ట్‌ . వాతావరణ పరిస్థితులు అంతకముందు కంటే మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

వివరాలు 

రెడ్ అలెర్ట్ 

రెడ్ అలర్ట్ అంటే డేంజర్ పరిస్థితి. ఇటువంటి అలర్ట్స్ తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇలా రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు,అంటే ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.అది కూడా 30 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం రెండు గంటల కంటే ఎక్కువ సమయం వాన కురుస్తుందని అంచనా వేసినప్పుడు రెడ్ అలర్ట్స్ జారీ అవుతాయి. దీంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను కూడా దీనికి తగినట్టు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన సమయం ఇది.