శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ
రెండు రోజుల క్రితం శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీమానాను పార్టీ ప్యానల్ అమోదించలేదు. పార్టీ అధినేతగా ఆయనే కొనసాగలంటూ ఎన్సీపీ కమిటీ ట్విస్ట్ ఇచ్చింది. కాసేపటీ క్రితమే ఎన్సీపీ ప్యానల్ ముగిసిన తర్వాత.. పార్టీ వైప్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మీడియా సమావేశంలో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. మే2న శరద్ పవర్ అధ్యక్ష రాజీనామా చేయడంతో తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్పీపీ కీలక నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పవార్ రాజీమానా ప్రకటనతో తాము షాక్ కు గురయ్యాయమని, ఆయన ఇలాంటి ప్రకటన చేస్తాడని తాము ఊహించుకోలేదని తెలిపారు.
శరద్ పవర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
సుప్రియా వాలే, అజియ్ పవార్, ఫ్రపుల్ పటేల్, భుజ్ బల్ సహా 18 మంది సభ్యులగా ఉన్న కమిటీ శుక్రవారం భేటి అయ్యింది. తమకు సమాచారం ఇవ్వకుండానే పవర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని, పార్టీ నేతలు, కార్యకర్తల డిమాండ్ల మేరకు ఈ రోజు కమిటీ భేటీ అయ్యిందని.. పార్టీ అధినేతగా పవర్ కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఫ్రపుల్ పటేల్ తెలియజేశారు. కమిటీ నిర్ణయంపై పవార్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే ఎన్పీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని గురువారం శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే.