'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్
ఈ వార్తాకథనం ఏంటి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికపై క్లారిటీ ఇచ్చారు.
బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఆ పుకార్లను నమ్మొద్దని పేర్కొన్నారు. ఎన్‌సీపీలోనే కొనసాగనున్నట్లు నొక్కిచెప్పారు.
తాను ఏ ఎమ్మెల్యేల సంతకాలను తీసుకోలేదని, అ ఊహాగానాలను నమ్మొద్దని చెప్పారు. తన మామ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో మంగళవారం తెల్లవారుజామున ఎన్నికలకు సంబంధించిన సమావేశమైనట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు.
ఎన్‌సీపీ
అజిత్ పవార్ మాతో మాట్లలేదు: బీజీపీ మహారాష్ట్ర చీఫ్
ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆరోపణపు వచ్చిన నేపథ్యంలో అజిత్ పవార్ ట్విట్టర్ వేదికగా ఖండించారు.
అజిత్ పవార్ బీజేపీలో చేరడం గురించి పార్టీలో ఎవరితోనూ చర్చలు జరుపుతున్నట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని పార్టీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే చెప్పారు.
ఇవి పుకార్లని, తాను అజిత్ పవార్ తోపాటు ఇతర ఎన్‌సీపీ నాయకులతో మాట్లాడినట్లు శివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే), రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
అజిత్ పవార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన తర్వాత అతను బీజేపీ చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.