
Rekha Nayak : కేసీఆర్, కేటీఆర్ పై రేఖా నాయక్ తీవ్ర వ్యాఖ్యలు.. ఉట్నూర్ కాంగ్రెస్ సభలో రాజకీయ దుమారం
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ వేదికగా రాజకీయ వేడి రాజుకుంది.
ఈ మేరకు ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉట్నూర్‌లో కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో రేఖా పాల్గొన్నారు.
ఏం రా కేసీఆర్, ఏం ముఖం పెట్టుకుని ఖానాపూర్‌లో ఓట్లు అడుగుతావ్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు కేటీఆర్ పైనా విరుచుకుపడ్డారు. నీ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తాడని చెబుతావ్ అంటూ ప్రశ్నించారు.
చెంచాలు, గ్లాసులు ఎత్తేవాళ్లకు ఖానాపూర్‌లో ఓట్లు ఎలా వేస్తారన్నారు. అసలు కేసీఆర్‌కు బుద్ధి ఉందా అని నిలదీశారు.
DETAILS
తీవ్ర అసంతృప్తికి గురైన రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ చెప్పేశారు
ఖానాపూర్ బీఆర్ఎస్ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కాకుండా మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ నాయక్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ చెప్పేశారు.
ఈ క్రమంలోనే టిక్కెట్ కోసం కాంగ్రెస్ పక్షాన చేరారు. అక్కడ టిక్కెట్ రాకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
మరోవైపు ఆసిఫాబాద్‌లో రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో గోండు యువకుడు,స్థానికుడైన వెడ్మ బొజ్జుకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది.
మొదట్నుంచి గులాబీ గూటిలోకి జాన్సన్ రాకను వ్యతిరేకిస్తూ వచ్చిన రేఖా,ఎట్టకేలకు ఆయనకే టిక్కెట్ ఖరారు కావడంతో ఇద్దరి మధ్య అగ్గిరాజుకుంది.
ఇదే సమయంలో రేఖానాయక్ సీఎం కేసీఆర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.