LOADING...
Punjab EX DGP Son Death Case: కోడలితో సంబంధం.. పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో సంచలన విషయాలు 
కోడలితో సంబంధం.. పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో సంచలన విషయాలు

Punjab EX DGP Son Death Case: కోడలితో సంబంధం.. పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడి మృతి కేసులో సంచలన విషయాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో మాజీ డీజీపీ మహమ్మద్‌ ముస్తాఫా కుమారుడు అఖీల్‌ అఖ్తర్‌ మృతి సంచలనాన్ని సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం హత్య కేసుగా మారింది. అఖీల్‌ మరణానికి ముందే తన భార్యకు తండ్రితో సన్నిహిత సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయానికి సంబంధించిన వీడియో ఇటీవల బయటకు రావడంతో కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబసభ్యులపై హత్య అభియోగాలు మోపారు. 33 ఏళ్ల అఖీల్‌ అక్టోబర్‌ 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కన్పించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు,

Details

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

అయితే వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అఖీల్‌ తల్లిదండ్రులు, మాజీ డీజీపీ ముస్తాఫా, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు రజియా సుల్తానా, డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా కుమారుడు మరణించినట్లు పోలీసులకు తెలిపారు. ప్రాథమికంగా పోలీసులు అనారోగ్య సమస్యల కారణంగానే మృతి అని నిర్ధారించారు. కాగా, మరణానికి కొన్ని రోజుల తర్వాత, అఖీల్‌ స్నేహితుడు పోలీసులను ఆశ్రయించి హత్య కావచ్చని ఆరోపణలు చేశారు. అదే సమయంలో, ఆగస్టు 27న అఖీల్‌ రికార్డు చేసిన ఒక వీడియో బయటకు రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఆ వీడియోలో అఖీల్‌ సంచలన ఆరోపణలు చేసి ఇలా చెప్పాడు: