NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల; ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ)NEET UG 2023 అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న వైద్య విద్య అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్ యూజీ పరీక్ష మే 07, 2023 (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 05:20 గంటల వరకు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో నిర్వహించనున్నారు. నీటీ యూజీ 2023 కోసం మొత్తం 18,72,341 మంది నమోదు చేసుకున్నారు. ఈ పరీక్ష భారతదేశంలోని 499 నగరాల్లో, భారతదేశం వెలుపల 7 నగరాల్లో నిర్వహించబడుతుంది.
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండిలా
1. తొలుత అధికారిక వెబ్‌సైట్neet.nta.nic.inకి వెళ్లండి. 2. హోమ్‌పేజీలో NEET UG అడ్మిట్ కార్డ్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు, మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవండి. 4. మీ నీట్ హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనపడుతుంది. 5. డౌన్‌లోడ్ చేసుకోని, దాన్ని ప్రింట్ కూడా తీసుకోండి. పరీక్ష కేంద్రంలోకి పొడవాటి చేతులు ఉన్న దుస్తువులు అనుమతించబడవు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సంప్రదాయ దుస్తులలో వచ్చినట్లయితే ఒక గంట ముందుగా వచ్చి రిపోర్ట్ చేయాలి. తక్కువ హీల్స్ ఉన్న చెప్పులు అనుమతించబడతాయి. బూట్లకు అనుమతి లేదు.