Page Loader
Telangana Voters: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ?
తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ?

Telangana Voters: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. పంచాయితీ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలో, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణలో మొత్తం ఓటర్ల జాబితాను ప్రకటించారు. అధికారుల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,66,41,489 మంది, మహిళలు 1,68,67,735 మంది, థర్డ్ జెండర్‌ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. ప్రత్యేకమైన విభాగాల ఓటర్లు యువ ఓటర్లు (18-19 ఏళ్ల వయస్సు): 5,45,026 సీనియర్ ఓటర్లు (85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ): 2,22,091 వికలాంగ (PWD) ఓటర్లు: 5,26,993 ఎన్‌ఆర్‌ఐ (ఓవర్సీస్) ఓటర్లు: 3,591

Details

పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా పలు పార్టీలు?

ఈ గణాంకాలు, పంచాయతీ ఎన్నికల అవసరాల కోసం ప్రత్యేకంగా సర్వే చేసి సేకరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ జాబితా విడుదలతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికలపై హడావిడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావడానికి పార్టీలన్నీ మరింత చురుకుదనం ప్రదర్శించనున్నాయి. అందరి ఓటింగ్ హక్కు పట్ల ఆవగాహన పెంచుతూ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.